Saturday 7 July 2012

రైతులను రాజులు చేయాలనే నీ సంకల్పం

మహిళలను మహారాణులుగా చూడాలనే నీ సంకల్పం

పేద విద్యార్థులకు ఉన్నత అందించాలనే నీ సంకల్పం

వికలాంగుల సంక్షేమం కోసం , వృదుల సంక్షేమం కోసం నీవు చేసిన కార్యక్రమాలు అమరం
జోహార్ రాజన్న జోహార్


రాజన్న

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో , మా కోసం నీవు జన్మించావు
నీ జీవితoలోని ప్రతి అక్షరం సువర్ణాక్షరం

నీ వ్యక్తిత్వం వజ్రం
నీ మనస్సు  బంగారం
నీ నవ్వు పూలహారం
నీ ప్రతి అడుగు సంచలనం
నీ ప్రతి మాట మాకోసం

నీ కోసం , నీ నవ్వు కోసం తెలుగు నేల ఎలప్పుడూ ఎదురుచూస్తుంది

.................................


రైతులకు వెన్నుముక్క వై నిలిచావు
మహిళలకు అన్నవైనావు
వికలాంగులకు నీవే నడకవైనావు
వృధులకు  కొడుకువై  ఆదుకునావు
విద్యార్థులకు విద్యాదాత వై తోడున్నావు
నీ తోటి సహచరులకు నేస్తంవై నిలిచావు
రామరాజ్యం చూడలేని మాకు రాజన్న రాజ్యం చూపావు
అనారోగ్యం తో భాధపదేవారికి ఆరోగ్యప్రధాతవై నిలిచావు
నాయకుడు అనే పదానికి అర్థం చాటావు
సూర్యుడు అస్తమించినా నీ చిరునవ్వు ఎప్పటికీ పదిలం

నీ ప్రజలకు బంగారు భవిష్యతు అందించిన నీవు
వారి సాక్షి గా అమరశేకరుడివి .....